Breaking News

పోలీస్‌ స్టేషన్‌లో దస్తగిరి దాదాగిరి

Published on Sun, 03/17/2024 - 08:30

తాడిమర్రి: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి పోలీసుస్టేషన్, తహసీల్దార్‌ కార్యాలయంలో శనివారం ఓ భూమి విషయంలో మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ముద్దాయి దస్తగిరి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన దేవరకొండ నాగమ్మకు చెందిన 3.84 ఎకరాల భూమిని ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లికి చెందిన రామ్‌నాయక్‌ తన భార్య శివాబాయి పేరున రూ.29 లక్షలకు కొనుగోలు చేశాడు.

ఇటీవల రామ్‌నాయక్‌ ఆ భూమి పక్కనున్న శివాయి సాగు భూమి రెండెకరాలు కూడా చదును చేస్తుండగా నాగమ్మ, కుమారులు అడ్డుకున్నారు. దాన్ని విక్రయించనందున ఆ భూమి జోలికి రావొద్దని, అలాగే తమకు ఇవ్వాల్సిన రూ.3 లక్షలు చెల్లించాలని అడిగారు. అయితే, రామ్‌నాయక్‌ శివాయి సాగు భూమి కూడా తనకే చెందుతుందనడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో.. దస్తగిరి శనివారం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌ నజ్మాబానుతో మాట్లాడారు. నిడిగల్లు గ్రామంలో రామ్‌ నాయక్‌ కొనుగోలు చేసిన పొలంపై స్టేటస్‌కో ఉందని, ఆ పొలం వద్దకు వీఆర్‌ఓను గానీ.. ఎస్‌ఐ, పోలీసులనుగానీ పంపవద్దని బెదిరించాడు. అలాగే, పోలీసుస్టేషన్‌కు వెళ్లి నాగమ్మ, ఆమె కుమారులు, అల్లుడు కలిసి రామ్‌నాయక్‌ను కొట్టారని, వారిపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఐ నాగస్వామిని డిమాండ్‌ చేశాడు. ఫిర్యాదు లేనప్పుడు కేసు ఎలా పెడతామని ఎస్‌ఐ ప్రశ్నించారు. ఇలా దస్తగిరి ఆగడాలు పెరిగిపోయాయని సామాన్య ప్రజలు వాపోతున్నారు.  

ఇదీ చదవండి: దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)