Breaking News

బిగ్‌షాట్‌లే టార్గెట్‌: కిడ్నాపులు, హత్యలే అతడి నైజం

Published on Sun, 10/02/2022 - 08:39

సాక్షి, అమలాపురం టౌన్‌: కోటీశ్వరులను ఎంచుకుని అతడు తొలుత బెదిరింపులకు పాల్పడతాడు. దారికి రాకపోతే కిడ్నాపులు చేస్తాడు. దానికీ దిగిరాకపోతే హత్యలకు సైతం తెగబడతాడు. ఐ.పోలవరం మండలానికి చెందిన త్రినాథవర్మ ఒకటిన్నర దశాబ్దాల నేర చరిత్ర ఇది. గత నెలలో రావులపాలెంలోని ఓ ఫైనా న్స్‌ వ్యాపారి ఇంటి వద్ద తుపాకితో కాల్పులకు తెగబడ్డ ఘటనలో ఇతడే ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. రెండు రోజుల కిందట అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. పోలీసు రికార్డుల ప్రకారం ఒకటిన్నర దశాబ్దాల కాలంలో త్రినాథవర్మ రెండు హత్యలు, నాలుగు కిడ్నాపులకు పాల్పడ్డాడు.

2011 ఆగస్టు 28న అమలాపురంలో ఆక్వా రైతు కేవీ సత్యనారాయణరాజును డబ్బుల కోసం కిడ్నాప్‌ చేశాడు. శ్రీశైలం అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లి సత్యనారాయణరాజుకు సజీవదహనం చేశాడు. సాక్ష్యాధారాలు మా యం చేశాడు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో ధనికుడిని డబ్బుల డిమాండ్‌ చేశాడు. చివరకు అతడి ని కూడా కిడ్నాప్‌ చేసి, హతమార్చాడు. అప్పట్లో ఈ కేసు అమలాపురంలో సంచలనం రేపింది. డబ్బుల డిమాండ్‌ చేస్తూ బెదిరింపులు, కిడ్నాప్‌లకు సంబంధించి త్రినాథవర్మపై నాలుగు కేసులు ఉన్నాయి.

డబ్బుల కోసమే రావులపాలెం కాల్పులు 
రావులపాలెంలో పైనాన్షియర్‌ గుడిమెట్ల వెంకట సత్యనారాయణరెడ్డి (కాటా బాస్‌) కుమారుడు ఆదిత్యరెడ్డిని కూడా  బెదిరించి డబ్బులు గుంజాలనే లక్ష్యంతోనే గత నెల ఐదున త్రినాథవర్మ గ్యాంగ్‌ వెళ్లింది. ఆదిత్యరెడ్డి అనూహ్యంగా ఎదురు తిరగడంతో దుండగులు తుపాకి కాల్పులకు తెగబడ్డారు. ఈ తరహా నేరాలకు త్రినాథవర్మే సూత్రధారి అని, అతడి అనుచరులు పాత్రధారులని పోలీసులు చెబుతున్నారు.

పోలీసు తనిఖీల్లో వర్మ రెండుసార్లు తుపాకులతో పట్టుబడ్డాడు. రావులపాలెం కాల్పుల ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ వై.మాధవరెడ్డి, రావులపాలెం ఇన్‌చార్జి సీఐ డి.ప్రశాంతకుమార్‌లు ఈ కేసులో తీగ లాగారు. దీంతో త్రినాథవర్మ నేరాల డొంక కదిలింది. అతడిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు.   

Videos

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు

Photos

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)