Breaking News

కాదన్నందుకే కడతేర్చాడు 

Published on Wed, 05/31/2023 - 03:21

న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నడిరోడ్డుపై పదహారేళ్ల బాలికను అత్యంత పాశవికంగా 20సార్లకుపైగా పొడిచి, సిమెంట్‌ శ్లాబ్‌తో పుర్రె పగిలేలా మోదిన ఉదంతంలో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు సాహిల్‌ను రెండు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం తాలూకు పలు అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

హత్య నేరాన్ని పోలీసుల విచారణలో సాహిల్‌ ఒప్పుకున్నాడు. పక్కా ప్రణాళికతోనే అదే చోట చంపాలని ముందే నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. సన్నిహితంగా ఉండే బాలిక సాక్షి తనను దూరంగా పెట్టడం సాహిల్‌కు నచ్చలేదు. బంధం కొనసాగించాలని కోరగా తన స్నేహితురాళ్ల సమక్షంలోనే సాక్షి ఇతడిని తిరస్కరించింది. సన్నిహితంగా ఉండాలని బలవంతం చేస్తే చితకబాదుతామని సాక్షి స్నేహితులు సాహిల్‌ను హెచ్చరించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

హత్యకు ఉపయోగించిన కత్తిని 15 రోజుల క్రితమే హరిద్వార్‌ నుంచి తీసుకొచ్చాడు. హత్య చేశాక పారిపోతూ కత్తిని రిఠాలా మెట్రో స్టేషన్‌ దగ్గరి పొదల్లో పడేశాడు. తర్వాత బులంద్‌షహర్‌లోని తన అత్తయ్య ఇంటికి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాక ఇంటికి ఫోన్‌చేశాడు. ఆ ఫోన్‌కాల్‌ సాయంతో జాడ కనిపెట్టి పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. సాక్షి శరీరంపై 34 లోతైన గాయాలు ఉన్నాయని, పుర్రె పగిలిందని పోలీసులు వెల్లడించారు.

2021 జూన్‌ నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉండగా విడిపోదామని ఇటీవల చెప్పడంతో గత ఎనిమిదిరోజులుగా వారి మధ్య గొడవలు అవుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతుడైన తన మాజీ ప్రియుడితో మళ్లీ టచ్‌లోకి రావడంతోనే గొడవ పెరిగిందని సాహిల్‌ చెప్పాడు. కాగా, సాక్షి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)