Breaking News

వెనుక నుంచి ఫాలో అవుతూ.. బ్యూటీ పార్లర్‌లో వధువుపై కాల్పులు జరిపిన పోలీస్‌!

Published on Mon, 05/22/2023 - 19:43

పాట్నా: మేకప్‌ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ఓ వధువుపై కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్పులు జరిపాడు. పార్లర్‌ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని ముంగేర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తారాపూర్ డయారాలోని మహేశ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అపూర్వ కుమారికి ఇటీవల ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు దగ్గర పడడంతో ఆమె మేకప్‌ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అయితే ఓ వ్యక్తి రహస్యంగా ఆమెను ఫాలో అవుతూ బ్యూటీ పార్లర్‌కు చేరుకున్నాడు.

యువతి మేకప్‌ వేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి పిస్టల్‌తో కాల్పులు జరిపాడు.  ఈ ఘటనలో ఒక బుల్లెట్‌ కుమారి భుజం నుంచి దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చింది. కుమారిపై కాల్పులు అనంతరం.. కానిస్టేబుల్‌ ఆ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, భయంతో పిస్టల్ అతని చేతిలో నుంచి జారిపోవడంతో అతను అలా చేయలేకపోయాడు.పార్లర్‌ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా బ్యూటీపార్లర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

గాయపడిన యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమెదు చేసుకుని ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ‘నిందితుడు పాట్నాలో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు గుర్తించాం. అతను మహేశ్‌పూర్ గ్రామానికి చెందినవాడు, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలో అరెస్టు చేస్తామని’ డీఎస్పీ తెలిపారు. వధువుకి, అతనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు కాల్పులు జరిపాడు? అన్న ప్రశ్నలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు.

చదవండి: ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్‌ టీచర్‌ భార్య, ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్‌తో కలిసి...

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)