Breaking News

HYD: మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం.. 

Published on Sat, 08/26/2023 - 11:27

సాక్షి, హైదరాబాద్‌: మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని చెబుతూనే కొందరు పోలీసులు మాత్రం తప్పతాగి డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ సీఐ ఫుల్లుగా మద్యం సేవించి హైస్పీడ్‌లో కారు నడిపి.. ఎదురుగా వస్తున్న వాహనాలన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బొల్లారం పోలీసు స్టేషన్‌ పరిధిలో సీఐ శ్రీనివాస్‌ ఫుల్లుగా మద్యం సేవించి కారును నడిపారు. ఈ క్రమంలో ఎదురుగా కూరగాయల లోడుతో వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో, వాహనం నడుపుతున్న శ్రీధర్‌.. వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో శ్రీధర్‌ తీవ్రంగా గాయపడటంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.

కాగా, సీఐ శ్రీనివాస్‌ ప్రస్తుతం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. సీఐ శ్రీనివాస్‌ వాహనంపై ఇప్పటికే ఆరు ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు ఉన్నాయి. ఇక, సీఐ శ్రీనివాస్‌ మద్యం సేవించి కారు నడుపారన్న నేపథ్యంలో డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో రీడింగ్‌ 200 దాటినట్టు తెలుస్తోంది.  

ఇది కూడా చదవండి: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం... తెలుగు కుటుంబం దుర్మరణం

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)