Breaking News

అట్టుడికిన కామారెడ్డి

Published on Wed, 09/25/2024 - 04:26

కామారెడ్డి టౌన్‌ / కామారెడ్డి క్రైం: ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ అసభ్యకర ప్రవర్తన కామారెడ్డిని అట్టుడికించింది. న్యాయం కావాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జ్‌తో దాదాపు ఆరుగంటల పాటు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్‌ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పట్ల అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విషయం తెలియడంతో çపలు విద్యార్థి సంఘాల వారు మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. 

స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, విద్యార్థుల తల్లిదండ్రులు  ఆందోళనలో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్యాంకురియన్, వైస్‌ ప్రిన్సిపాల్‌ వీసీ థామస్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పాఠశాల లోపలికి దూసుకెళ్లారు. ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.  

పీఈటీపై ఫిర్యాదు చేసినా... 
పలుమార్లు ఫిర్యాదు చేసినా సదరు పీఈ టీని తొలగించలేదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే డీఈవో, ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పటికే పాఠశాలకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయిస్తున్న సమయంలోనే బయట నుంచి పెద్దఎత్తున యువకులు అక్కడకు చేరుకున్నారు. 

పోలీసులు వారిని అడ్డుకున్నా వినలేదు. పలుమార్లు పోలీసులకు, ఆందోళన చేస్తున్న వారితో తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఉన్న కొందరు పాఠశాల భవనంపై రాళ్లు రువ్వడంతో కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్‌ తలకు రాయి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. 

వెంటనే సీఐని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తోపులాటలో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కాళ్లు విరగడంతో పాటు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ రాజారాం సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు.  అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ సింధుశర్మ ఆందోళకారులను సముదాయించారు.  సాయంత్రం ఆరుగంటల వరకు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు