Breaking News

విషాదం.. కరెంట్‌ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు

Published on Fri, 03/08/2024 - 15:15

జైపూర్‌: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్‌ షాక్‌ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్‌ నగర్‌ తెలిపారు.  విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్‌ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

అయితే  విద్యుత్ షాక్‌కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)