Breaking News

శిశు విక్రయ ఘటన.. కలెక్టర్‌ సీరియస్‌.. ఆసుపత్రి సీజ్‌

Published on Tue, 07/09/2024 - 08:50

సాక్షి, కామారెడ్డి జిల్లా: శిశు విక్రయ ఘటనలో సమన్విత ఆసుపత్రిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. వైద్య శాఖ అధికారులు ఆసుప్రతిని సీజ్‌ చేశారు. అనుమతి లేకున్నా.. ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, స్త్రీ లింగం పై వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. శిశు విక్రయ కేసులో ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడు సహా 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాగా, పుట్ట బోయేది ఆడో మగో తెలుసుకోవడానికి జనం ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లకు పరుగులు తీస్తుండగా.. వారి ఆసక్తిని సొమ్ము చేసుకుంటూ వాటి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టేది అడబిడ్డ అని తెలియగానే కడుపులోనే చంపేయాల నుకుంటున్నవారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ అబార్షన్లు చేస్తున్నారు. స్కానింగ్‌, అబార్షన్ల కోసం రెండు మూడు రాష్ట్రాల నుంచి కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రికి వచ్చేవారంటే.. ఆ ఆస్పత్రి ఎంత ఫేమస్‌ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆస్పత్రులలో తనిఖీలు చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులూ ఈ పాపంలో భాగమయ్యారు.

గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేనపు డు, బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు అబార్షన్‌ చేస్తారు. దీనికి మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ అనుమతులు పొందాల్సి ఉంటుంది. సమన్విత ఆస్పత్రికి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా సమన్విత ఆస్పత్రిలో వైద్య సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంటీపీకి సంబంధించి చార్జీలు పొందుపరచడాన్ని చూసి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవాక్కయ్యారు. మూడు నెలలలోపు గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 5 వేలు, మూడు నెలలు దాటిన గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 10 వేలు చార్జీగా అందులో పేర్కొనడం విశేషం.
 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)