Breaking News

రూ.50 లక్షలకు టీడీపీ నేత టోకరా

Published on Tue, 01/30/2024 - 06:31

బొమ్మలసత్రం (నంద్యాల): తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ పనులు చేద్దామని చెప్పి ఓ డీఎస్పీ కుమారుడ్ని నిండా ముంచేసిన ఘటన­లో మైదుకూరు టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి మల్లిఖార్జునయాదవ్‌పై చీటింగ్‌ కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ సన్నిహితుడు, కాంట్రాక్టర్‌ మల్లిఖార్జునయాదవ్‌ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, కొల్లాపూర్‌ మధ్య కేతిపల్లి గ్రామంలో వంతెన నిర్మాణ పనులకు కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడు.

ఈ నేపథ్యంలో నంద్యాలలో నివశిస్తున్న కర్నూలు, నంద్యాల జిల్లాల ఇంటెలిజెన్స్‌ విభాగం ఇన్‌ఛార్జ్‌ డీఎస్పీ యుగంధర్‌ కుమారుడు చిరంజీవిని  భాగస్తుడిగా చేసుకుని కాంట్రాక్ట్‌ పనులు పూర్తి చేశారు. మల్లిఖార్జునయాదవ్‌ తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడనే అనుమానంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో చిరంజీవికి రూ.80 లక్షలు చెల్లించేలా మల్లిఖార్జునయాదవ్‌ ఒప్పందం చేసుకున్నాడు. అయితే రూ.30 లక్షలు చెల్లించి.. మిగతా రూ.50 లక్షలు చెల్లించకుండా మొండికేశాడు.దీంతో చిరంజీవి నంద్యాల తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మల్లిఖార్జునయాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరిబాబు తెలిపారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)