Breaking News

Vizag: అక్రమ కాల్‌ సెంటర్లపై సీబీఐ దాడులు

Published on Sun, 09/29/2024 - 10:49

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విదేశీయులే లక్ష్యంగా సైబర్‌ మోసాలకు పాల్పడుతూ అక్రమ కాల్‌ సెంటర్లు నిర్వహి­స్తున్న సంస్థలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ సాగర్‌ నగర్‌ ప్రాంతంలో పలు సంస్థల్లో తనిఖీలు చేశారు. మురళీనగర్‌లో ఉంటున్న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. భారత్‌లో పలు రాష్ట్రాల నుంచి రుణ ఆఫర్లు, క్రెడిట్‌ కార్డుల పేరుతో అమెరికా, ఇతర దేశా­లకు చెందిన వారిని ఆకర్షిస్తూ సైబర్‌ నేరాలకు పాల్ప­డుతున్నట్టు ఎఫ్‌బీఐ ఇచ్చిన సమా­చారంతో సీబీఐ అధికారులు ఆయా సంస్థలపై నిఘా పెట్టారు.

తొలుత థానేలోని కాల్‌ సెంటర్‌ నుంచి 140 మందిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ అక్రమ ఆపరేషన్‌కు సంబంధించిన సర్వ­ర్‌ను అహ్మ­దాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కొంత మందిని అరెస్టు చేయగా.. హైరద­రాబాద్, కోల్‌కతా, విశాఖల­లోనూ ఈ సంస్థల కార్యక­లాపాలు నిర్వహిస్తు­న్నట్లు తెలుసు­కున్నారు.

దీంతో నగరంలో విస్తృతంగా తని­ఖీలు చేశారు. సాగర్‌నగర్‌ ప్రాంతంలోని దేవీ ప్యారౖ­డె­జ్‌లో నివాసం ఏర్పరచు­కున్న అక్షయ్‌ పాత్వాల్, ధీరజ్‌ జోషి, హిమాన్షు శర్మ, పార్థ్‌బాలి, ప్రితేష్‌ నవీన్‌ చంద్రపటేల్‌లను మురళీనగర్‌ ప్రాంతంలో అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌­టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)