Breaking News

అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు

Published on Fri, 06/28/2024 - 05:37

వినుకొండ (నూజెండ్ల): పల్నాడు జిల్లాలో గురువా­రం తెల్లవారుజామున జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. గుంటూరు–కర్నూ­లు జాతీయ రహదారిపై కేవలం గంటల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదాలతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం..  

చెట్టును ఢీకొన్న వాహనం 
రూరల్‌ పరిధిలోని కొత్తపాలెం సమీపంలో టయోటా వాహనం అదుపు తప్పిచెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన టీటీడీలో పనిచేసి పదవీ విరమణ చేసిన బ్రహ్మశ్రీ సోమాసి బాలగంగాధర్‌ శర్మ (69), ఆయన భార్య యశోద (67), డ్రైవర్‌ కట్టా నిర్మలరావు (45) అక్కడికక్కడే మృతి చెందారు. 

అదే కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు హెచ్‌.వై.శర్మ, అతని భార్య సంధ్య తీవ్రంగా గాయపడగా, ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరందరూ కర్ణాటకలోని బళ్లారి నుంచి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుని గుంటూరు వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వగ్రామానికి వెళ్తూ.. 
బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మీరావలి (25) స్వగ్రామం వెళుతుండగా మినీలారీ ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మీరావలి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.   

తండ్రీ కొడుకులు మృతి 
అదే రహదారిలో వినుకొండ రూరల్‌ మండలం వద్ద.. ప్రకాశం జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన మాలెపాటి పెదరామ కోటేశ్వరరావు(45) తన కుమారుడు అంజిబాబుతో (25) కలిసి వినుకొండ రూరల్‌ మండలం కొతపాలెం వస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు మృతి చెంద­గా కుమారుడికి తీవ్రగాయాలయ్యా­యి. అంజిబాబును మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ గుంటూరులో మృతిచెందాడు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)