Breaking News

ట్యాంక్‌ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లి.. 

Published on Sun, 07/30/2023 - 09:10

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ట్యాంక్‌ బండ్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లో ట్యాంక్‌ బండ్‌పై కారు అదుపు తప్పి హుస్సేన్‌ సాగర్‌ డివైడర్‌ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎయిర్‌ బ్యాగ్‌ ఓపెన్‌ కావడంతో పెను ప్రమాదం తప్పింది. 

వివరాల ప్రకారం.. ట్యాంక్‌ బండ్‌పై ఉన్న ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు అదుపుతప్పి హుస్సేన్‌ సాగర్‌ డివైడర్‌ మీదకి దూసుకెళ్లి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కొద్దిలో కారు హుస్సేన్‌ సాగర్‌లో పడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకోవడంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ‍ప్రాణాలతో బయటపడ్డారు. 

కాగా, ప్రమాదం తర్వాత వారిద్దరూ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కారులో ఉ‍న్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. 

మరోవైపు.. రాజేంద్రనగర్‌లోని అరాంఘర్‌ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, బైక్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతిచెందగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకోవడంతో అతడికి ప్రమాదం తప్పింది. 

ఇది కూడా చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి.. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)