Breaking News

వరంగల్‌లో నల్లగొండ విద్యార్థిని ఆత్మహత్య

Published on Thu, 02/27/2025 - 12:19

రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని వరంగల్‌ జిల్లా అరేపల్లి సమీపంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌(BSc agriculture student) యూనివర్సిటీ ఆవరణలోని వరంగల్‌ వ్యవసాయ కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ పట్టణానికి చెందిన గుంటోజు సత్యనారాయణ, రమ్య దంపతులు రాక్‌హిల్స్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ పెద్దకాపర్తిలో బ్రాంచి పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. మూడవ సంతానం రేష్మిత(19)కు(Reshmitha)ఇటీవల వరంగల్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ బీఎస్సీలో సీటు వచ్చింది. 

నెల రోజుల క్రితం అడ్మిషన్‌ తీసుకుని హాస్టల్‌ ఉంటోంది. హాస్టల్‌లో చేరినప్పటి నుంచి చదువుతో ఒత్తిడికి గురవుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెబుతోంది. దీంతో ఇటీవల ఇంటికి తీసుకొచ్చి నచ్చజెప్పి మళ్లీ వరంగల్‌ కాలేజీకి పంపించారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో రేష్మిత ఫోన్‌లో మాట్లాడింది. మంగళవారం హాస్టల్‌ గదిలో రేష్మిత్‌ మాత్రమే ఉంది. 

బుధవారం ఉదయం రేష్మిత ఉన్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా.. రేష్మిత గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇంటి నుంచి వెళ్లిన వారంలోనే కుమార్తె హఠాన్మరణం చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నల్లగొండకు తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హాస్టల్‌ సిబ్బంది, మేనేజ్‌మెంట్‌ పర్యవేక్షణ లోపం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సత్యనారాయణ ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)