Breaking News

వేడి నీళ్లు మీద పడి బాలుడి మృతి

Published on Sun, 01/12/2025 - 11:25

గచ్చిబౌలి: తల్లి స్నానం కోసం పెట్టుకున్న వేడి నీళ్ల బకెట్‌ను పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు నీళ్లు మీదపడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

వికారాబాద్‌ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లికి చెందిన దంపతులు మైసం రాజు, సోనీ బతుకు దెరువు కోసం వచ్చి మణికొండలోని శివపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజు వాచ్‌మెన్‌గా పని చేస్తూనే కారు డ్రైవింగ్‌ చేస్తుంటాడు. ఈ నెల 6న సాయంత్రం 4.40 గంటల సమయంలో సోనీ స్నానం చేసేందుకు బకెట్‌లో హీటర్‌ పెట్టి నీళ్లను వేడి చేసింది. ఆమె కొడుకు ధీరజ్‌ (04) ఆడుకుంటూ బకెట్‌ను పట్టుకున్నాడు. బకెట్‌ కిందపడటతో నీళ్లన్నీ శరీరంపై పడి  బాలుడికి 60 శాతం కాలిన గాయాలయ్యాయి.

 వెంటనే గమనించిన తల్లి హుటాహుటిని సమీపంలోని ఓ ప్రైవేట్‌ అస్పత్రికి తరలించింది. అక్కడి నుంచి నిలోఫర్‌కు వెళ్లగా ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ధీరజ్‌ శుక్రవారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. వేడి నీళ్లు మీదపడి ఒక్కగానొక్క మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు