Breaking News

పట్టపగలే దొంగల ముఠా బీభత్సం.. భారీ దోపిడీ!

Published on Mon, 03/10/2025 - 17:19

పాట్నా: బీహార్ రాష్ట్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం స్పష్టించారు.  ఓ నగల షాపులో ప్రవేశించి సుమారు రెండు కోట్ల రూపాయిల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాష్ట్రంలోని బోజ్ పూర్ జిల్లాలోని గోపాలి చౌక్ వద్ద ఉన్న తనిష్క్ నగల దుకాణంలోకి ప్రవేశించిన ఒక ముఠా వారిని బెదిరించి భారీ ఎత్తును నగలను, నగదును తస్కరించుకుపోయారు.  అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పట్ట పగలే ఇలా ఒక దుకాణంలోకి ప్రవేశించి నగలను, భారీ ఎత్తును డబ్బును దోచుకుపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.

అరగంటకు పైగా షాపులోనే..
దోపిడీ ప్రణాళిక వచ్చిన ఒక ముఠా సుమారు అరగంట పాటు షాపులోనే ఉన్నారు. పెద్ద ఎత్తున తుపాకులతో వచ్చిన దొంగల ముఠా..  ఎటువంటి అనుమానం రాకుండా అరగంటకు పైగా షాపులోనే గడిపారు. ముందుగా నగల షాపులో ఉన్న వారిని బెదిరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నగలను, క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును దొంగిలించుకుపోయారు.

సెక్యూరిటీ గార్డు గన్ ను దొంగిలించి..
నగల షాపు దోచుకున్న అనంతరం సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న గన్ ను సైతం దొంగలు దొంగిలించి అక్కడ నుంచి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి దొంగలు అక్కడ  నుంచి పారిపోయారు.

నలుగురు తప్పించుకున్నారు.. ఇద్దరు దొరికారు
దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ ప్రాంతంలో జల్లెడ పట్టే యత్నం చేశారు. అయితే  ఆ దొంగల్లో ఇద్దరు పోలీసులను చూసి తప్పించుకోవాలని చూశారు. దాంతో పోలీసులు షూట్ చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నాలుగు బండిల్స్ జ్యూయలరీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకో నలుగురు తప్పించుకున్నారు.   ఈ భారీ దొంగతనంపై సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.. త్వరలోనే మిగతా నలుగుర్ని పట్టుకుంటమన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)