Breaking News

HYD: జంట హత్య కేసులో ట్విస్ట్‌..

Published on Wed, 01/15/2025 - 09:18

సాక్షి, హైదరాబాద్‌: నార్సింగి(narsingi) పుప్పాలగూడ(puppalaguda) జంట హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా దారుణంగానే హత్య చేసినట్లు తేలింది. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు గుర్తించారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్‌ సాకేత్‌, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా గుర్తించారు.

వివరాల ప్రకారం.. నార్సింగిలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధమే వీరి హత్యకు కారణమైనట్టు పోలీసులు తెలిపారు. అంకిత్ సాకేత్‌కు వివాహిత బిందూతో గత పరిచయం ఏర్పడింది. బిందుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నెల 11న బిందును సాకేత్‌ ఎల్బీనగర్ నుంచి నానక్ రామ్ గూడకు పిలిపించాడు. బిందును తన స్నేహితుడి రూమ్‌లో ఉంచాడు. తర్వాత ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు.

అనంతరం, అక్కడ ఏకాంతంగా గడిపారు. అయితే, సాకేత్‌కు తెలియకుండా మరో యువకుడితో బిందు ప్రేమాయణం సాగించింది. మరో ప్రియుడు.. వీరిద్దరినీ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బిందుపై దాడి చేశాడు. బండరాళ్లతో బాది హత్య చేశాడు. సాకేత్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. పారిపోతున్న సాకేత్‌పై కూడా అతడు దాడికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బండరాయితో దాడి చేసి పరారయ్యాడు. హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. వీరిద్దరి హత్య కన్నా ముందు అంకిత్ అదృశ్యమైనట్టు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. వనస్థలిపురంలో బిందుపై మిస్సింగ్‌ కేసు నమోదైంది. నిన్న నార్సింగిలో ఇద్దరి హత్య జరిగింది.

నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కలకలం

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)