Banjarahills: బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం...

Published on Thu, 04/25/2024 - 18:41

హైదరాబాద్: అదుపు తప్పిన వేగంతో వచ్చిన బెంజ్‌ కారు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. అమెరికాలో నివసించే అయిదుగురు యువతీ యువకులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌–45లో నివసించే వెంకట‍ష్‌, అవినాష్‌తో పాటు జర్మనీ, అమెరికాలో నివసించే మ్యాక్స్‌మిలన్‌ హెన్రీ, ప్రీతమ్, ఓ యువతి  బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో బస చేశారు.

మంగళవారం రాత్రి వీరు బెంజ్‌ కారులో జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌–45లోని దస్పల్లా హోటల్‌ పైన ఉన్న కారా పబ్‌కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం అర్ధరాత్రి కారులో మాదాపూర్,గచ్చిబౌలి, దుర్గంచెరువు ప్రాంతాలను చుట్టేసి పార్క్‌ హయత్‌ హోటల్‌ వైపు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 10/36 శ్రీజ్యువెలర్స్‌ వద్ద వీరు వెళ్తున్న కారు అదుపుతప్పి అంతే వేగంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి దూసుకెళ్లింది. కాగా.. ఇందులోని అయిదుగురు యువతీ యువకులు క్షేమంగా బయటపడ్డారు.

 సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించగా కారు నడుపుతున్న వెంకటేష్‌ 44 ఎంజీ, అవినాష్‌ 173 ఎంజీతో పాటు మిగతావారు కూడా మద్యం తాగినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన చలసాని మాధవీదేవి పేరుతో కారు రిజిస్టరై ఉందని పోలీసులు గుర్తించారు. ఓ పెళ్లికి హాజరుకావడానికి వీరంతా నగరానికి వచ్చినట్లు తేలింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కారును సీజ్‌ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)