Breaking News

ఇద్దరు పిల్లలను చంపి ఐటీ ఉద్యోగుల ఆత్మహత్య!

Published on Tue, 01/07/2025 - 09:27

సాక్షి బెంగళూరు: అపత్కాలంలో నమ్మించిన వాళ్లే మోసం చేశారు. ఆ మోసాన్ని తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఇద్దరు బిడ్డలకు విషం ఇచ్చి చంపడమే కాకుండా.. ఆ తర్వాత  దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక  ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్షన్‌ రెండో లేఅవుట్‌లో రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్‌ అలహాబాద్‌కు చెందిన అనూప్‌కుమార్‌ (38), ఆయన భార్య రాఖీ (35) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల అనుప్రియా అనే కుమార్తె, రెండేళ్ల ప్రియాంక్‌ అనే కుమారుడున్నారు. అనూప్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమార్తె అనుప్రియాకు మానసికంగా సరిగా లేకపోవడంతో ఇంటి పనికోసం, తన పాపను చూసుకునేందుకు ఇద్దరు పనివారిని  పెట్టుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ సోమవారం ఉదయం ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపేసి ఆ తర్వాత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం పనివారు ఉదయాన్నే వచ్చి కాలింగ్‌ బెల్‌ కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెంటనే తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లి చూడగా వారి హత్యోదంతం బయటపడింది.  

అనూప్‌ కుమార్‌కు ఉద్యోగం లేకపోవడంతో దంపతులు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయని ఉద్దేశ్యంతో తెలిసిన బంధువు ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టారు. బంధువులు మోసం చేశారు. పిల్లలకు చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలకు తట్టుకోలేక తనువు చాలించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)