Breaking News

Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!

Published on Sun, 01/19/2025 - 18:30

బెంగళూరు: ‘ మీరు సైబర్‌ స్కామ్‌ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్‌ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్‌లో కాలర్‌ టోన్‌  రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ  ఆ కాలర్‌ ట్యూన్‌ ఉద్దేశం మాత్రం.. ఫోన్‌ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.

అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు.  ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’లో పెట్టాడు.  రూ. 50 లక్షలు  పెడితే  దాని విలువ రూ. 12  కోట్లకు చేరింది.

ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు.  విజయ్‌ కుమార్‌ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో  దోచుకుపోయాడు.  తాము ఈడీ అధికారులమని,  ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్‌  కుమార్‌ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్‌ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్‌  చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్‌ కుమార్‌.. వారు   చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్‌,  పాన్‌  కార్డువివరాలతో పాటు తన  వ్యక్తిగత బ్యాంకింగ్‌ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.

అంతే.. దాంతో సైబర్‌ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్‌ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా  చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్‌ సుంచి  దొంగిలించడం గమనార్హం.

ముగ్గుర్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు

తాను నష్టపోయిన తర్వాత అసలు  విషయం తెలుసుకున్నబాధితుడు   విజయ్‌ కుమార్‌ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని  ఆశ్రయించాడు.  దీనిపై దర్యాప్తు  చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్‌  చేశారు.  ఇదే దుబాయ్‌   కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది.  

ఈ స్కామ్‌(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో  తరుణ్‌ నటానీ, కరణ్‌, దవల్‌ షాలను అరెస్ట్‌ చేశారు.  షా అనే నిందితుడు దుబాయ్‌ చెందిన  సైబర్‌ స్కామ్‌లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను   కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్‌ చెందిన సైబర్‌ నేరగాడు. 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)