Breaking News

రషీద్‌ది రాజకీయ హత్యే

Published on Tue, 07/23/2024 - 05:42

సాక్షి, నరసరావుపేట: వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అతని తల్లి బడేబీ, తండ్రి ఫరేషా స్పష్టం చేశారు. ‘మా కుమారుడికి పాత కక్షలు ఏమీ లేవు. నేర చరిత్ర లేదు. ఎవరినీ చంపలేదు, నరకలేదు. కేవలం వైఎస్సార్‌సీపీలో చురుగ్గా తిరుగుతున్నాడన్న కారణంతోనే టీడీపీ నేతలు నడి రోడ్డుపై దారుణంగా హత్య చేయించారు. ఇందుకు జిలానీని అడ్డుపెట్టుకొన్నారు. బుల్లెట్‌ బండి తగలబెట్టడానికి, మా కుమారుడికి సంబంధం లేదు. ఈ విషయాలన్నీ వినుకొండలో ఎవరిని అడిగినా చెబుతారు’ అని చెప్పారు. 

జగన్‌ను ఎందుకు అడ్డుకున్నారు? 
తన పార్టీ కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నేతలు హత్య చేస్తే అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డికి లేదా అని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ను అసెంబ్లీ వద్ద ఎందుకు అడ్డుకున్నారని ప్రశి్నంచారు. ‘రషీద్‌ గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదా? ప్లకార్డులను ఎందుకు చింపేశారు? జగన్‌ చేతిలో ప్లకార్డులు ఉంటే ప్రజలంతా చూస్తారు. మాకు జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తుందని కదా’ అని అన్నారు. కొడుకును కోల్పోయి బాధలో ఉన్న తమకు వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారని తెలిపారు.  ఢిల్లీలో ధర్నా చేసి పోరాడతానన్నారని చెప్పారు. 

తమకు న్యాయం చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇంటి వద్దకు వచ్చి భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచారు. ఇప్పటికీ తమ పిల్లల్ని టీడీపీ వారు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంకా నలుగురు ఉన్నారు, మిమ్మల్నీ చంపుతామంటూ ఫోన్లు చేస్తున్నారన్నారు. పిల్లలకు ఫోన్లు చేయిస్తున్న వారెవరో తేల్చాలని కోరారు. ‘ఆమె ఎవరో హోంశాఖ మంత్రి అనిత అంట.. ఎంత అన్యాయంగా మాట్లాడుతోంది! పాత కక్షలు, ముస్లింలు ముస్లింలు కొట్టుకున్నారని ఆమె చెప్పడం సరికాదు. 

మా కడుపు కోతను అర్థం చేసుకొని మరో­సారి పాతకక్షల వల్ల హత్య అని అనవద్దు. మాకు న్యాయం చేయండి’ అని అన్నారు. బొండాలు కొట్టే కత్తితో రషీద్‌ను హత్య చేశారని అంటున్నారని, ఆ కత్తిని ఎందుకు చూపడంలేదని ప్రశి్నంచారు. అది ఎక్కడ తయారు చేశారు, ఎవరు చేయించారో పోలీసులు తేల్చాలని డిమాండ్‌ చేశారు. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)