Breaking News

బాచుపల్లి: రోడ్డు గుంతలే నా బిడ్డను బలిగొన్నాయి

Published on Wed, 08/02/2023 - 15:27

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలో ఈ ఉదయం జరిగిన విషాదంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఎనిమిదేళ్ల దీక్షిత మృతి చెందిందని పోలీసులు చెబుతుండగా.. రోడ్డు గుంత కారణంగానే తన బిడ్డ ప్రాణం పోయిందని దీక్షిత తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

ఘటనలో దీక్షిత తండ్రి కిషోర్‌కు సైతం గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ని స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్ప్రతికి తరలించారు. అయితే.. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి స్థానిక ఆసుపత్రి వెంటనే డిశ్చార్జి అయ్యి బయటకు వచ్చాడు. ‘‘రోడ్లు నా కూతురును బలి తీసుకున్నాయి. నేను ఇప్పుడు ఏమీ మాట్లాడే స్థితిలో లేను అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడాయన. మరోవైపు బంధువులు తూర్పు గోదావరి జిల్లాలోని సొంతూరుకు దీక్షిత మృతదేహాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. 

బాచుపల్లిలో బైక్‌పై వెళ్తున్న సమయంలో.. గుంత కారణంగా బైక్‌పై నుంచి ఎగిరిపడి దీక్షిత కింద రోడ్డు మీద పడిపోయింది. ఆ సమయంలో వేగంగా ఓ స్కూల్‌కు చెందిన మినీ వ్యాన్‌ ఆమె పైనుంచి వెళ్లిందన్నది తండ్రి వాదన. అయితే.. మినీ వ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించి డ్రైవర్‌ను డ్రైవర్‌ రహీంను అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక స్థానికంగా ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో దీక్షిత  2వ తరగతి చదువుతోంది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)