Breaking News

జీపుతో ఢీకొట్టి కిడ్నాప్‌..

Published on Sat, 07/13/2024 - 05:10

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. పట్టణ నడిబొడ్డున అందరూ చూస్తుండగా మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త చాకలి శ్రీనును జీపుతో ఢీకొట్టి.. ఆపై కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇంట్లో.. ఆమె సమక్షంలో తీవ్రంగా కొట్టి పట్టణ శివారులో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. ఆళ్లగడ్డకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డికి లింగందిన్నెకు చెందిన చాకలి శ్రీను అనుచరుడు. 

శుక్రవారం ఆరోగ్యం సరిగాలేదని ఆళ్లగడ్డలోని మెడికల్‌ స్టోర్‌కు వచ్చి, మందులు తీసుకుని మరో యువకుడితో కలిసి బైక్‌పై లింగందిన్నెకు బయలుదేరాడు.  వారిని వాహ­నం­­లో వెంబడిస్తూ వచ్చిన ఎమ్మెల్యే  అఖిలప్రియ అను­చరులు బైక్‌ను ఢీకొట్టారు. దీంతో శ్రీను, మరో యువకుడు కిందపడ్డారు. వెంటనే కర్రలు, రాడ్లతో  వాహనంలోంచి  దిగిన టీడీపీ రౌడీ మూకలు  శ్రీను­ను కొట్టుకుంటూ వాహనంలో వేసుకుని ఎమ్మెల్యే ఇంట్లోకి తీసుకెళ్లారు.  

మరో యువకుడు పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని శ్రీనును కిడ్నాప్‌ చేసి ఎమ్మెల్యే  ఇంట్లో బంధించారని పోలీసులకు చెప్పినా ఫలితం లేదు. తుదకు శ్రీనును చంపొద్దని బతిమాలడంతో స్పృహ కోల్పోయేలా కొట్టి పొలాల్లో పడేశారు.   ఆపై పోలీసులు 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.  
 
3 గంటలకు పైగా ఉత్కంఠ 
శ్రీనును కిడ్నాప్‌ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించిన విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించింది. టీవీ చానళ్లలో ప్రముఖంగా ప్రసారమైంది. అయినా పోలీసులు చలనం లేకుండాపోయింది.  సుమారు 3 గంటలకు పైగా బాధితుడిని ఇంట్లో ఉంచి కొడుతున్నా.. అరుపులు బయటకు వినిపిస్తున్నా.. పోలీసులు మౌనం వహించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫోన్‌ చేస్తే.. విడిచి పెట్టాలని కోరుతున్నామని చెప్పారే తప్ప కనీసం ఆ ఇంటి వద్దకు కూడా వెళ్లక పోవడం విమర్శలకు తావిస్తోంది. 

విషయం వైరల్‌ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. టీడీపీ శ్రేణులతో చర్చలు కొనసాగించినట్లు తెలుస్తోంది.  కొట్టి పొలాల్లో పడేస్తామని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ముందుగానే పోలీసులు 108 వాహనాన్ని సిద్ధం చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు.  బాధితుడికి ఆళ్లగడ్డలో ప్రథమ చికిత్స కూడా చేయించకుండా  50 కి.మీ దూరంలోని నంద్యాల వైద్యశాలకు తరలించడం గమనార్హం. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)