Breaking News

మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం

Published on Mon, 09/23/2024 - 11:02

అల్లూరి, సాక్షి: మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతిచెందగా.. సోమవారం ఉదయం వాళ్ల మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్‌ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు.

హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్‌, అమృత,  హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్‌ కోసం గాలింపు కొనసాగుతోంది.

కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా,  బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్‌ హరదీప్‌(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)