Breaking News

యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్‌ మృతి

Published on Tue, 10/03/2023 - 05:22

నూజివీడు : వినాయక నిమజ్జనాల సందర్భంగా విధులు నిర్వహిస్తూ ఓ యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ గంధం నరేంద్ర(32) ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో శనివారం రాత్రి డీజే ఆపమని చెప్పిన కానిస్టేబుల్‌ నరేంద్రపై ఉలాస రామకృష్ణ అనే యువకుడు తలపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నరేంద్రను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు.

దీంతో మృతదేహాన్ని సోమ­వారం తెల్లవారుజామున నూజివీడు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతో ఏరియా ఆస్పత్రి వద్దకు నూజివీడు సర్కిల్‌ పరిధిలోని పోలీసు సిబ్బంది, అధికారులు, మృతు­డి బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు చేరుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కానిస్టేబుల్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొద్దిసేపు ఆందోళన చేశారు.

కాగా, ఏరియా ఆస్పత్రిలో ఉన్న నరేంద్ర భౌతికకాయాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏలూరు డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి కూడా నివాళులర్పించారు. అనంతరం నరేంద్ర స్వగ్రామమైన ఎనీ్టఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడులో పోలీస్‌ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)