Breaking News

అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో కేసు

Published on Tue, 09/10/2024 - 01:13

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై మరో కేసు నమోదైంది. కూకట్‌పల్లి ఏసీపీగా పనిచేసిన రోజుల్లో అక్కడ 340 ఎకరాల భూకబ్జాకు సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. ఇన్నాళ్లు భయంతో మిన్నకుండిపోయి న బాధితుడు మీర్‌ అబ్బాస్‌ అలీఖాన్‌ ధైర్యం చేసి సైబరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ అవినాష్‌ మహంతికి తాజాగా ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లిలోని సర్వే నంబరు 1007లో ఉన్న 340 ఎకరాల భూమి అబ్బాస్‌అలీఖాన్‌ తండ్రి నవాబ్‌ మీర్‌ హషిమ్‌ అలీఖాన్‌కు వారసత్వంగా వచి్చంది.

దీనిపై కొందరు కుటుంబీకుల మధ్య సివిల్‌ సూట్‌ నడుస్తోంది. కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన అంశాల్లో పట్టులేని హషిమ్‌ వీటి కోసం ఎస్‌ఎస్‌.మొయినుద్దీన్, యాసీన్‌ షేక్‌ సహకారం తీసుకున్నాడు. దీనిని వారు తమకు అనుకూలంగా మార్చుకొని, ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించారు. ఇది తెలిసీ హషిమ్‌.. వీరిద్దరిపై కేపీహెచ్‌బీ ఠాణాలో 2014 మేలో ఫిర్యాదు చేశారు. దీంతో యాసీన్‌ కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న నాయిని భుజంగరావును సంప్రదించి భారీ మొత్తం ఆఫర్‌ చేశాడు. దీంతో కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ హషిమ్‌అలీని భుజంగరావు వేధించడంతో పాటు తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేయించారు.

ఈ క్రమంలోనే గ్రీన్‌కో కంపెనీ నిర్వాహకులు సీహెచ్‌.అనిల్, శ్రీనివాసరావు.. యాసీన్, మొయినుద్దీన్‌తో కలిసి ఆ భూమి కాజేయడానికి ముందుకొచ్చారు. భుజంగరావు సలహా మేరకు వీరంతా గూండాలను పంపి హషిమ్‌ను కిడ్నాప్‌ చేసి నిర్బంధించి, భూమికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోపక్క ఈ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేయనివ్వకుండా భుజంగరావు దర్యాప్తు అధికారిపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిణామాలు, వేధింపులు భరించలేకపోయిన హషిమ్‌ తీవ్ర అనారోగ్యానికి గురై 2020 జూన్‌ 30న కన్నుమూశారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో భుజంగరావు అరెస్టు కావడంతో ధైర్యంచేసి బయటికొచి్చన అబ్బాస్‌ అలీఖాన్‌ ఆయనపై ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం కేసు నమోదు చేసుకున్న ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)