Breaking News

టీడీపీ నేతల బెదిరింపులకు ‘ఉపాధి’ ఉద్యోగి బలి

Published on Fri, 07/12/2024 - 05:23

చిలకలూరిపేట: టీడీపీ నాయకుల బెదిరింపు­లు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యో­గి ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూ­రిపేట మండలం గోపాలంవారిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... గోపాలంవారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్‌(38) గత 18 సంవత్సరాలుగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 

ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు వచ్చి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆనంద్‌ను ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేయా­లని హెచ్చరించారు. ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయిస్తా­మ­ని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మన­స్తాపానికి గురైన ఆనంద్‌ గురువారం మధ్యా­హ్నం తన ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. 

వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకురాగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. ఆనంద్‌కు భార్య రత్నకుమారి, కుమార్తెలు దివ్య(10వ తరగతి), అర్షిత(8వ తరగతి), మహి(7వ తరగతి) ఉన్నారు. తన భర్త మృతికి గోపాళంవారిపాలెం గ్రామానికి చెందిన చిన్నం రవిబాబు, గోపాళం సాగర్‌బాబు, గోరంట్ల బుజ్జి, గోపాళం శ్రీధర్, మిన్నకంటి వీరబాబు, మానుకొండ బాలయ్య తదితరుల వేధింపులే కారణమని రత్నకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)