Breaking News

రియల్టర్‌ రమేష్‌ హత్య కేసు: నిందితుడు రాణా పరార్‌

Published on Sat, 11/02/2024 - 10:14

సాక్షి,హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాణా  కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అక్టోబర్‌ 4వ తేదీన హైదరాబాద్‌లోని పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధి సంస్కృతి టౌన్ షిప్‌లో నివాసం ఉంటున్న రియల్టర్‌   రమేష్ కుమార్  భార్య నిహారిక, ప్రియుడు రాణాల చేతులో దారుణ హత్యకు గురయ్యాడు. 

హత్య అనంతరం నిందితులు రమేష్‌కుమార్‌ మృతదేహాన్ని కారులో కర్ణాటకు తరలించారు. అక్కడ నిహారిక మరో ప్రియుడు నిఖిల్ రెడ్డితో కలిసి కొడుగు జిల్లా సుంటికుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి నిప్పు పెట్టిన నిందితులు పారిపోయారు. నిందితులను సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించిన సుంటికుప్ప పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిందితులను 10రోజుల కస్టడీకి తీసుకున్నారు.

 సీన్ రీ కన్‌స్ట్రషన్ కోసం అక్టోబర్‌ 30వ తేదీన నిందితులను పోచారం ఐటీకారిడార్ ఠాణాకు తీసుకువచ్చారు. దర్యాప్తు లో భాగంగా రెండు రోజుల పాటు ఇక్కడనే ఉండేందుకు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బృందావనం హోటల్‌లో 6 గదులను అద్దెకు తీసుకున్నారు. తెల్లవారుజామున నిందితుడు రాణా  కానిస్టేబుల్ హరీష్ మొబైల్‌ తీసుకుని పారిపోయాడని ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం స్థానిక పోలీసులతో పాటు కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: స్నేహితుడితో కలిసి భర్తను చంపిన భార్య

 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)