Breaking News

టీడీపీ కార్యాలయంలో లైంగిక దాడి నిందితుడు

Published on Sat, 11/25/2023 - 03:34

పట్నం బజారు (గుంటూరు), పెదకాకాని: ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యా­లయంలోకి చొరబడ్డాడు. నిందితుడిని అదు­పు­లోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పో­లీసు­లపై శుక్ర­వారం గుంటూరులో టీడీపీ కార్యకర్తలు దాడికి తెగ­బడ్డారు. కానిస్టేబుళ్లను నిర్బంధించే యత్నం చేశారు.

సీఐ స్థాయి అధికారి వారిస్తున్నా వినకుండా బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం గుంటూరు స్వర్ణభార­తీ­నగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత చల్లా లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు నాగార్జున వర్సిటీలో చదివిన సమయంలో అక్క­డ కాంట్రాక్టర్‌గా పని చేసిన లక్ష్మీనారాయణ పరిచ­యం పెంచుకుని శారీరకంగా లొంగ­దీసు­కున్నాడు.

అప్పటికే అతడికి వివాహం అయిందని తెలియడంతో నిలదీసిన బాధితు­రాలిని నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి బెదిరించి పలుమార్లు అఘాయి­త్యానికి ఒడిగ­ట్టాడు. అనంతరం పెళ్లి చేసుకున్న బాధి­తురాలి భర్తను కూడా బెదిరించి వారి కాపురా­న్ని విచ్ఛిన్నం చేశాడు. తన కుమార్తె జీవితం అన్యా­యమైందనే బాధతో బాధితురాలి తండ్రి ఈ ఏడాది ఆగస్టులో గుండెపోటుతో మరణించాడు. దీంతో నింది­తుడు లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  

టీడీపీ కార్యాలయంలో నక్కిన నిందితుడు: సాంకే­తి­క పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి లైవ్‌ లొకేషన్‌ను గుర్తించిన కానిస్టేబుళ్లు ఇర్ఫాన్, మణి­ప్రసాద్‌ అతడి కారును వెంబడిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకు­న్నారు.

పోలీసులను గుర్తించిన టీడీపీ నేత­లు, కార్య­కర్త­లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ సమక్షంలోనే దాడికి యత్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. అనంతరం సీఐ సురేష్‌బాబు అక్క­డకు చేరుకోవడంతో నిందితుడు చల్లా లక్ష్మీనారాయణ ఇక్కడ లేడంటూ బుకాయించారు. అయితే లక్ష్మీనారాయణను టీడీపీ కార్యాలయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మెల్లగా జారుకున్నారు. 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)