Breaking News

‘ముందస్తు సమాచార’మిచ్చేసి కోట్లు పోగేశాడు

Published on Fri, 01/30/2026 - 14:28

వామ్మో.. ఈయ‌న‌గారి తెలివి మామూలుగా లేదు. ప‌నిచేస్తున్న సంస్థ‌కే పంగ‌నామం పెట్టి మ‌స్తు పైస‌లు వెన‌కేసుకున్నాడు. అవినీతిని నిరోధించాల్సిన పోలీసే లంచాలు మ‌రిగి పెడ‌దారి ప‌ట్టాడు. కోట్ల రూపాయ‌ల అక్ర‌మాస్తులు వెన‌కేసుకుని అడ్డంగా దొరికిపోయాడు. పాపం పండ‌డంతో కోర్టు మెట్లు ఎక్కి విచార‌ణ ఎదుర్కొంటున్నాడు. 

విజయనగరం క్రైమ్‌/గుర్ల: విజయనగరం అవినీతి నిరోధ‌క‌ విభాగం (ఏసీబీ)లో 15 ఏళ్ల క్రితం హోంగార్డుగా విధుల్లో చేరిన నెట్టి శ్రీనివాసరావు అక్రమ ఆస్తులు అక్షరాలా రూ.20 కోట్లుగా ఏసీబీ అధికారులు నిగ్గుతేల్చారు. ఏసీబీ విభాగంలో పనిచేసిన సమయంలో ఏసీబీ దాడుల వివరాలను సంబంధిత వ్యక్తులకు ముందుగానే ఆయన చేరవేసేవాడు. దీనికోసం రూ.వేలు, రూ.లక్షల్లో తీసుకునేవాడు.

ఆయనపై అనుమానం వచ్చిన ఏసీబీ ఉన్నతాధికారులు ఏడా­దిన్నర క్రితం ఎస్పీ ఆఫీస్‌కు బదిలీ చేసి నిఘా పెట్టారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు విజయనగరం గోకపేటలో శ్రీనివాసరావు ఉంటున్న అపార్ట్‌మెంట్, బంధువుల ఇళ్లలో గురువారం సోదాలు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరావును అరెస్టుచేసి విశాఖప‌ట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

చ‌ద‌వండి: పాపం.. మ‌హిళా కానిస్టేబుల్ విషాద‌గాథ‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)