Breaking News

గుడికి వెళ్లొచ్చే సరికి కొడుకు మాయం.. అదృశ్యమైన గంటల్లోనే..

Published on Wed, 01/04/2023 - 16:43

సాక్షి, హైదరాబాద్‌: అదృశ్యమైన బాలుడు కొన్ని గంటల్లో శవమై తేలిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌రావు వివరాల ప్రకారం..లాల్‌వాణినగర్‌కు చెందిన యాతం మహేష్‌యాదవ్‌ కుమారుడు యువన్‌ (9) చిన్నప్పటి నుంచి మాటలు రాదు. ఈ నెల 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తల్లితండ్రులు గుడికి వెళ్లి వచ్చేసరికి యువన్‌ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది.  

సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. 
ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు రికార్డయింది. లాల్‌వాణీనగర్‌ ప్రధాన రహదారి మరో వైపు ఉన్న సీసీ కెమరా రికార్డులు పరిశీలిస్తే యువన్‌ అటు వైపు వచ్చినట్లుగా కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బండచెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్న కోణంలో వెతకడం ప్రారంభించారు. గుర్రపు డెక్కతీసే యంత్రం పై నుంచి గాలిస్తుండగా చెరువు చివర కాలిన శవాన్ని గుర్తించారు. ఒంటి మీద ఉన్న బట్టలు ఆదారంగా యువన్‌దే మృతదేహంగా నిర్ధారించారు. 

అనుమానాలెన్నో.. 
బండచెరువులో చెత్త వేయకుండా కంచె ఏర్పాటు చేశారు. యువన్‌ మృతదేహం దొరికిన ప్రాంతంలో కంచె తొలగించి ఉంది. దీనిపై ఆరా తీయగా చెరువులో పందులు పెంచుకునే వారు వాటికి ఆహారం వేయడానికి కంచె తొలగించారని పారిశుద్ధ్య సిబ్బంది చెబుతున్నారు. ఘటనా జరిగిన స్థలానికి ప్రధాన రహదారి కొద్దిదూరంలోనే ఉంది. కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.గస్తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండివుంటే ఈ సంఘటనను గుర్తించి ఉండేవారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి పరిశీలించారు. జాగిలం కూడా అక్కడక్కడే తిరిగింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)