Breaking News

భార్యతో గొడవపడి.. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న భర్త

Published on Mon, 02/10/2025 - 11:08

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌) : భార్యతో గొడవ పడిన భర్త..ఆమె పనిచేసే దుకాణానికి వెళ్లి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దోమలగూడ తాళ్లబస్తీకి చెందిన శ్రవణ్‌కుమార్‌ రాణిగంజ్‌లోని బేరింగ్‌ షాపులో పనిచేస్తున్నాడు. ఇతనికి మౌనికతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది.  భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆమెపై అనుమానంతో కొట్టడం, తిట్టడం చేస్తుండటంతో ఎనిమిదేళ్లుగా ఇద్దరూ విడిగా ఉంటున్నారు. శ్రవణ్‌కుమార్‌ తాళ్లబస్తీలో ఉంటుండగా మౌనిక దోమలగూడలో నివసిస్తూ ప్యాట్నీ సెంటర్‌లోని కామాక్షి సిల్‌్క్సలో రెండున్నరేళ్లుగా క్యాషియర్‌గా పని చేస్తోంది. విడివిడిగా ఉంటున్నా ఇద్దరూ అప్పుడప్పుడూ మాట్లాడుకునే వారు. అలాగే కుమార్తె కూడా గత 8 నెలల నుంచి శ్రవణ్‌కుమార్‌ వద్దే ఉంటోంది.  

పెట్రోల్‌ బాటిళ్లతో వచ్చి.. 
ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్యాట్నీ సెంటర్‌లోని కామాక్షి సిల్‌్క్సకు కుమార్తెతో సహా వచి్చన శ్రవణ్‌కుమార్‌ భార్యతో గొడవ పడ్డాడు. షాపులో పనిచేసే సిబ్బంది అతడిని వారించి బయటకు పంపించారు. మళ్లీ 8.15 గంటలకు షాపు వద్దకు వచి్చన శ్రవణ్‌కుమార్‌ తనతో పాటు వాటర్‌ బాటిళ్లలో పెట్రోల్‌ తీసుకుని వచ్చాడు. రావడం రావడమే ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని బాటిల్‌లోని పెట్రోల్‌ను కింద పోశాడు. సిబ్బంది అతడిని వారిస్తుండగానే చేతిలో ఉన్న లైటర్‌తో నిప్పంటించాడు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అతనికి అంటుకున్నాయి. అక్కడ ఉన్న కొన్ని చీరెలు, సామగ్రితో పాటు సిబ్బంది మొబైల్‌ ఫోన్లు కాలిపోయాయి. 

50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి... 
సిబ్బంది వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక  సిబ్బంది, మార్కెట్‌ పోలీసులు, షోరూం సిబ్బంది కలిసి మంటలను ఆరి్పవేశారు. సకాలంలో మాల్‌లోని సిబ్బంది తమ దగ్గర ఉన్నఅగ్నిమాపక పరికరాలతో మంటలను కొద్దిగా అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రవణ్‌కుమార్‌ 50శాతంకు పైగా కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహంకాళి ఏసీపీ సర్ధార్‌సింగ్, మార్కెట్‌ ఎస్‌ఐ శ్రీవర్ధన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.  

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)