Breaking News

పాక్‌ ప్రమాదాల్లో 40 మంది దుర్మరణం

Published on Mon, 08/26/2024 - 04:16

ఇస్లామాబాద్‌/కరాచీ: పాకిస్తాన్‌లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు బస్సుల ప్రమాదాల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది యాత్రికులు సైతం ఉన్నారు. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని మాక్రాన్‌ తీరప్రాంత జాతీయరహదారిపై 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా పల్టీకొట్టింది. దీంతో బస్సులోని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. ఇరాన్‌లో పర్యటించిన షియా యాత్రికులను తిరిగి పంజాబ్‌ ప్రావిన్స్‌కు తీసుకొస్తుండగా బస్సు బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది లాహోర్, గజ్రన్‌వాలా ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.

లోయలో పడి..
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో 29 మంది చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. అయితే పర్వతప్రాంతంలో ఘటన జరగడంతో ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతులు సధాయోతి జిల్లాకు చెందిన వారని ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్‌ ఉమర్‌ ఫరూక్‌ చెప్పారు. ఘటనపై పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ సంతాపం వ్యక్తంచేశారు.

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)