Breaking News

పెళ్లిళ్లు కావడం లేదని.. కర్మలు తొలగిపోవాలని..!

Published on Sat, 11/15/2025 - 20:24

మూఢ నమ్మకాలు.. పిచ్చి నమ్మకాలు బాగా పెరిగిపోయాయి. దోష నివృత్తి పేరుతో సాటి మనుషుల ప్రాణాలే తీస్తున్న ఘటనలు ఎక్కువై పోయాయి.  తమకు ఏదో దోషం ఉందని భావించి 16 రోజుల పసికందును నలుగురు మహిళలు పొట్టన పెట్టుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని జోథాపూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. 

పెళ్లిళ్లు కావడం లేదని..
నలుగురు మహిళలు.. ఒక మేనల్లుడు. అయితే సదరు మహిళలకు పెళ్లిళ్లు కావడం లేదు. పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అంతే తమలో ఏదో దోషం ఉందని, అందుచేత ఆ దోష నివృత్తి అనే మూఢ నమ్మకంతో సొంత మేనల్లుడైన 16 రోజుల పసిప్రాయాన్ని తొక్కి చంపేశారు. వారంతా కలిసి తమ కాళ్లతో ఆ పసికందును తొక్కి హత్యచేశారు.

ఇదంతా ఒక వీడియోలో రికార్డ్‌ అయ్యింది. ఒక మహిళ పూనకం వచ్చి ఏదో చెబుతున్నట్లు ఉండగా, చుట్టూ మహిళలు కూర్చొని ఉంటారు. ఆ మహిళా ఏదో చెబుతూ ఉంటుంది. వీరంతా ఆమె చెప్పేది ఆసక్తిగా వింటూ ఉంటారు.  ఆ సమయంలోనే ఒక మహిళ  తన ఒడిలో పసికందుతో కూర్చొని ఉంటుంది.  ఇలా పూనకం వచ్చిన ఆమె ఆదేశానుసారం ఆ పసికందును అక్కడ కూర్చొన్న మహిళలు తొక్కి చంపేశారు. 

భ్రూణ హత్యలపైనే నిషేధం  విధించిన  ఈ కాలంలో.. ఇలా పుట్టిన ఒక బిడ్డను అతిపాశవికంగా చంపేయడం వారి ఆటవిక నాగరికతకు అద్దం పడుతోంది. 

వారికి వేసే శిక్ష ఘోరంగా ఉండాలి: యువకుడి తండ్రి
ఇదంతా వరుసకు వదినలు అయ్యేవారు చేసిన పనే అని ఆ పసికందు తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు. వారి పెళ్లిళ్ల కోసం ఇలా చేశారంటూ బోరమంటున్నాడు, వారికి పడేశిక్ష అత్యంత కఠినంగా ఉండాలని తండ్రి పోలీస్‌ అధికారులకు విన్నవించుకుంటున్నాడు. ఈ కేసులో ఇంకా ఎవరు ఎవరు ఉన్నారనేది పూర్తిస్థాయి దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)