Breaking News

యువతితో వీడియో కాల్‌ మాట్లాడుతూ యువకుడి ఆత్మహత్య

Published on Sat, 06/22/2024 - 09:31

దుండిగల్‌: ఓ యువతితో చివరిసారిగా వీడియో కాల్‌ మాట్లాడుతూ తాను చనిపోతున్న దృశ్యాలను చూపిస్తూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామం చెర్రీ తాండాకు చెందిన రాజు కుమారుడు డి.శ్రీకాంత్‌(22) డి.పోచంపల్లిలోని సర్వే నం.120లో తన అన్నా వదినలతో కలిసి ఉంటున్నాడు. 

అతడు గండిమైసమ్మలోని గ్లాండ్‌ ఫార్మా పరిశ్రమలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తమ సొంత గ్రామంలో పొలం పనులు ఉండటంతో అన్నా వదినలు 15 రోజుల క్రితమే ఊరికి వెళ్లిపోగా శ్రీకాంత్‌ ఒక్కడే ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి శ్రీకాంత్‌ ఫోన్‌లో ఎవరితోనో గొడవ పడ్డాడు. తన గదిలోకి వెళ్లి తాడుతో రాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. శ్రీకాంత్‌ చివరిసారిగా ఓ యువతితో ఫోన్‌లో వీడియో కాల్‌ మాట్లాడినట్లు గుర్తించారు. మంచంపై ఫోన్‌ పెట్టి తాను ఉరి వేసుకుని చనిపోతున్న దృశ్యాలను వీడియో కాల్‌ ద్వారా ఆ యువతికి చూపించినట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.  

 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)