Breaking News

ఆమె వయసు 39, అతనికి 21.. ‘సంబంధం’పై తండ్రి హెచ్చరించడంతో..

Published on Mon, 02/27/2023 - 15:26

చిత్తూరు అర్బన్‌: పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ మోజులో పడిన 21 ఏళ్ల యువకుడు కన్న తండ్రిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరచా డు. తాను కొడుతున్న దృశ్యాన్ని ప్రియురాలికి వీడియోకాల్‌ చేసి తండ్రిని చితకబాదాడు. చిత్తూరు నగరంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి టూటౌన్‌ ఎస్‌ఐ మల్లికార్జున, బాధితుడి కథనం మేరకు.. ఢిల్లీబాబు అనే వ్యక్తి గాంధీరోడ్డులో కాపురముంటూ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. 

ఇతని కొడుకు భరత్‌ (21) ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలు ఉన్న 39 ఏళ్ల ఓ మహిళతో ఇతను సన్నిహితంగా ఉండేవాడు. ఇది నచ్చకపోవడంతో కుమారుడిని పలు మార్లు ఢిల్లీబాబు హెచ్చరించాడు. ఈవిషయమై తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలున్నాయి.

 ఆదివారం ఇంట్లో భోజనం చేస్తున్న తండ్రి వద్దకు వచ్చిన భరత్‌.. మహిళకు వీడియోకాల్‌ చేసి తన తండ్రిని కొడుతున్న దృశ్యం చూడమంటూ ఫోన్‌ ఆన్‌లోనే ఉంచి దాడి చేశాడు. చింతకట్టెతో తలపై తీవ్రంగా కొ ట్టడంతో ఢిల్లీబాబుకు రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ ఢిల్లీబాబును కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)