Breaking News

ఇంటి బయట పోలీసులు ఇంట్లో మర్డర్‌

Published on Thu, 01/16/2025 - 06:21

గ్వాలియర్‌(ఎంపీ): గొడవలు వద్దు, కూర్చుని మాట్లాడుకోండని సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులు ఇంటిబయట ఉండగానే కూతురిని కన్న తండ్రి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అమ్మాయి బంధువు సైతం కాల్పులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్‌లోని గోలా కా మందిర్‌ ప్రాంతంలో 45 ఏళ్ల మహేశ్‌ సింగ్‌ గుర్జార్‌కు 20 ఏళ్ల కూతురు ఉంది. 

జనవరి 18వ తేదీన ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే తనకిప్పుడు ఈ పెళ్లి ఇష్టంలేదని కుమార్తె చెప్పడంతో మహేశ్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఎలాగైనా పెళ్లి జరగాల్సిందేనని మహేశ్‌ మేనల్లుడు రాహుల్‌ సైతం పట్టుబట్టి ఆమెను ఒప్పించే ప్రయత్నంచేశాడు. ముగ్గురి మధ్య వాగ్వాదం విషయం తెల్సి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వాళ్లు హుటాహుటిన పెళ్లింటికి వచ్చేశారు. పెళ్లి ఏర్పాట్లతో ఇళ్లంతా ముస్తాబు చేసిఉండటంతో లోపలికి వెళ్లకుండా మగ, ఆడ కానిస్టేబుల్స్‌ ఇంటి బయటే వేచి చూస్తున్నారు.

 ఎంతచెప్పినా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మహేశ్, రాహుల్‌ ఒక నాటు తుపాకీ, పిస్టల్‌తో అమ్మాయిని కాల్చి చంపారు. నాలుగు బుల్లెట్లను కాల్చారు. బుల్లెట్ల మోతతో హుతాశులైన స్థానికులు, పోలీసులు ఇంట్లోకి పరుగులుతీశారు. అప్పటికే రాహుల్‌ అక్కడి నుంచి తప్పించుకోగా తండ్రి అక్కడే ఉన్నాడు. రక్తమోడుతున్న అమ్మాయిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పారిపోయిన బంధువు రాహుల్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)