చిత్తూరులో 14 ఏళ్ల బాలిక అదృశ్యం

Published on Wed, 11/13/2024 - 05:50

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు­లో ఓ మైనర్‌ బాలిక కనిపించకుండా పోయింది. నగరంలోని చామంతిపురానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె తండ్రి గల్ఫ్‌ దేశంలో పొట్టకూటి కోసం వెళ్లారు. తల్లి, అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలిక ఆదివారం చికెన్‌ తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బాలిక ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడి, తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు చెప్పి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆదివారం రాత్రి వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మంగళవారం చిత్తూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువయ్యిందని.. మహిళలు మిస్‌ అవుతున్నా, అఘాయిత్యాలు, అత్యాచారాలకు గురవుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తోందన్నారు. చిత్తూరులో కనిపించకుండాపోయిన బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చామంతిపురం వాసులు మంగళవారం రాత్రి వన్‌టౌన్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని బాలిక వివరాలు చెప్పాలని నిరసన తెలిపారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)