Breaking News

ఈత నేర్పమంటివి కదా కొడుకా..

Published on Sat, 04/27/2024 - 11:08

బోయినపల్లి(చొప్పదండి): ‘సెలవులచ్చినయి దోస్తులు ఈత నేర్చుకుంటుండ్రు.. ఈత నేర్పమంటివి కదా కొడుకా.. కనిపించకుండా పోతివా కొడుకా..’ అని ఆ తల్లి రోదన అక్కడి వారి హృదయాలను కలచివేసింది. ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి చేపూరి మణితేజ(12) బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన చేపూరి తిరుమల–గంగయ్యలకు మణితేజ, రిత్విక్‌ కొడుకులు.

పాఠశాలకు వేసవి సెలవులు రావడంతో ఈత నేర్చుకునేందుకు తండ్రి గంగయ్య, తాత రామయ్యలతో కలిసి గత మూడు రోజులుగా మణితేజ వెళ్తున్నాడు. గ్రామంలోని తాటివనం పరిసరాల్లోని వందురునూతిలో ఓ రోజు తాత, మరో రోజు తండ్రి ఈత నేర్పుతున్నారు. మణితేజ తాత రామయ్య శుక్రవారం గంగాధర మండలం చర్లపల్లికి వెళ్లగా.. తండ్రి గంగయ్యతో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. అదే బావిలో మరికొందరు సైతం ఈత కొడుతున్నారు.

ఈక్రమంలో ఈత కొడుతుండగా మణితేజ మునిగిపోయాడు. పది గజాల లోతులో నీళ్లు ఉండడంతో ఎంత వెదికినా బాలుడి ఆచూకీ లభించలేదు. మోటార్లు పెట్టి నీరు తీసే ప్రయత్నం చేసినా ఖాళీ కాలేదు. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్‌ రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇవ్వగా.. గజ ఈతగాళ్లు వచ్చి తెప్ప సాయంతో మణితేజ మృతదేహాన్ని బయటకు తెచ్చారు. బావిలో మణితేజ గల్లంతయ్యాడని తెలియడంతో గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయగానే తల్లిదండ్రులు, బంధువుల                  రోదనలు మిన్నంటాయి. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)