వైఎస్సార్‌సీపీ సుబ్బారాయుడు హత్య కేసు.. 11 మంది అరెస్ట్‌

Published on Wed, 08/07/2024 - 19:35

సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇక, ఈ కేసులో తాజాగా పోలీసులు 11 మందిని అరెస్ట్‌ చేశారు. కానీ, ఏ-1గా ఉన్న బుడ్డా శ్రీనివాస్‌ను మాత్రం పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడం గమనార్హం.

ఇక, మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత పెద్ద సుబ్బారాయుడిని టీడీపీ నేత బుడ్డా శ్రీనివాస్‌ హత్య చేశాడు. అతడి అనుచరులతో కలిసి పోలీసుల ముందే దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా 11 మంది ముద్దాయిలను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో మిగతా 15 మంది ముద్దాయిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిని నంద్యాల సమీపంలోని చాపిరేవుల అండర్ పాస్ దగ్గర అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన మూడు కత్తులు, మూడు కర్రలు, రెండు సెల్‌ఫోన్‌లను, స్కోడా కారు, ఫార్చునర్ కారులను పోలీసులు సీజ్‌ చేశారు.

అరెస్టు అయిన వారి వివరాలు..

  • A2 బుడ్డా రెడ్డి ప్రభాకర్ రెడ్డి, 

  • A3 వంగాల లక్ష్మి రెడ్డి, 

  • A4 వంగాల పుల్లారెడ్డి, 

  • A5 బుడ్డా రెడ్డి లక్ష్మి నాగశేఖర్ రెడ్డి @ కుంటి శేఖర్ రెడ్డి, 

  • A7 తాలూరి శ్రీనివాసులు @ దుబ్బ శ్రీను,

  • A9 పెరుమాళ్ల వెంకటరమణ @ డీలర్ రమణ,

  • A10 మైలాపురం రామచంద్ర రెడ్డి,

  • A11 దూదేకుల బాల హుసేని,

  • A12 జిల్లెల్ల బాస్కర్,

  • A13 గని రంగస్వామి,

  • A14 వంగాల ఈశ్వర్ రెడ్డి,

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)