Breaking News

CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా

Published on Sat, 10/07/2023 - 22:52

సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు.

క్వింటన్‌ డికాక్‌ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్‌ మార్క్రమ్‌  (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది.
 


అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది.  నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్లో ఔటయ్యాడు.  

ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది.  స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)