Breaking News

జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు 20 శాతం పెంపు

Published on Wed, 09/03/2025 - 12:17

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? మీరు జొమాటో ద్వారా చేసే ఆర్డర్లపై గతంలో కంటే కాస్త ఎక్కువగా బిల్లు రావడం గమనిస్తున్నారా? అందుకు కంపెనీ వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్‌ ఫీజు కారణం. జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజును గతంలో కంటే 20% పెంచింది. సెప్టెంబర్ 2, 2025 నుంచి అన్ని నగరాల్లో ప్రతి ఆర్డర్‌పై ఈ ఫీజును రూ.10 నుంచి రూ.12కు పెంచింది.

డెలివరీ ఫీజులు, పన్నులు, రెస్టారెంట్ ధరలు కాకుండా జొమాటో ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్‌ ఫీజును ఏప్రిల్ 2023లో మొదటిసారి ప్రవేశపెట్టింది. అయితే ప్రాథమికంగా ఇది రూ.2గా ఉండేది. క్రమంగా జనవరి 2024లో రూ.4కు, అక్టోబర్ 2024లో ఏకంగా రూ.10, ఇప్పుడు దాన్ని రూ.12కు పెంచేసింది.

ఇప్పుడే పెంపు ఎందుకు?

మార్కెట్‌ నిపుణులు అంచనాల ప్రకారం.. ఈ సమయంలోనే ప్లాటఫామ్‌ ఫీజును పెంచేందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా ఫుడ్ డెలివరీ వాల్యూమ్స్ గణనీయంగా పెరిగే పండుగ సీజన్‌కు ముందు ధరలు పెంచితే ఆదాయం పెరుగుతుందని భావించి ఉండవచ్చని చెబుతున్నారు. రోజుకు 2.3–2.5 మిలియన్ల ఆర్డర్లు వస్తుండటంతో ఒక్కో ఆర్డర్‌పై రూ.2 పెరిగినా త్రైమాసిక ఆదాయంలో అదనంగా రూ.45 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ ఫీజు పెంపుపై జొమాటో ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..‘ప్లాట్‌ఫామ్‌ విస్తరణలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగం’ అని తెలిపారు.

ఇదే బాటలో స్విగ్గీ..

అధికమవుతున్న నిర్వహణ ఖర్చుల మధ్య లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ఈమేరకు ప్లాట్‌ఫామ్‌ ఫీజులు పెంచుతున్నాయి. జొమాటో పోటీ కంపెనీ స్విగ్గీ ఎంపిక చేసిన మార్కెట్లలో ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.14 వరకు విధిస్తుంది. 

ఇదీ చదవండి: జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)