Breaking News

Zomato: ఛార్జీలు ఎందుకు పెంచుతుందో తెలుసా..?

Published on Wed, 01/03/2024 - 12:10

గత త్రైమాసిక ఫలితాల్లో క్రమంగా నష్టాలు పోస్ట్‌ చేసిన జొమాటో ఇటీవల కొంత లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సేవలందించే సంస్థలు వాటి అవసరాలకు తగినట్లు ఛార్జీలు పెంచుకునే వీలుంది. నూతన సంవత్సరం సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను అందుకున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ జొమాటో.. ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఛార్జీని రూ.3 నుంచి రూ.4కి పెంచింది. 

కొత్త సంవత్సరం సందర్భంగా జొమాటో తన ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఫీజును తాత్కాలికంగా కొన్ని మార్కెట్‌‌‌‌‌‌‌‌లలో ఆర్డర్‌‌‌‌‌‌‌‌కు రూ.9 వరకు పెంచింది.   మార్జిన్‌‌‌‌‌‌‌‌లను మెరుగుపరచడానికి, లాభదాయకంగా మారడానికి గత ఏడాది ఆగస్టులో రూ.2 ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఛార్జీను ప్రవేశపెట్టింది. అనంతరం దీనిని రూ.3కు పెంచింది. జనవరి 1న దాన్ని మళ్లీ రూ.4కు తీసుకొచ్చింది.

ఇదీ చదవండి: న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే?

కొత్త ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఛార్జీ ‘జొమాటో గోల్డ్‌‌‌‌‌‌‌‌’తో సహా వినియోగదారులందరికీ వర్తిస్తుంది. జొమాటో క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ బ్లింకిట్ కూడా నూతన సంవత్సం సందర్భంగా అత్యధిక ఆర్డర్‌‌‌‌‌‌‌‌లు  పొందినట్లు తెలిసింది. ఇదిలావుండగా, జొమాటోకు దిల్లీ, కర్ణాటకలోని పన్ను అధికారుల నుంచి రూ.4.2 కోట్ల జీఎస్టీ నోటీసులు అందాయి.  పన్ను డిమాండ్ నోటీసులపై అప్పీల్ చేస్తామని సంస్థ పేర్కొంది. డెలివరీ ఛార్జీలుగా సేకరించిన మొత్తంపై జీఎస్టీ చెల్లించలేదంటూ గతంలోనూ సంస్థ నోటీసులు అందుకుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)