Breaking News

జొమాటో కొత్త అవతారం.. ఆర్బీఐ అనుమతి!

Published on Thu, 01/25/2024 - 16:48

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో (Zomato) అనుబంధ సంస్థ అయిన జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేమెంట్స్‌ అగ్రిగేటర్ లైసెన్స్‌ని మంజూరు చేసింది. దీంతో తన ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ-కామర్స్ లావాదేవీల నిర్వహణకు జొమాటోకు అనుమతి లభించింది.

దేశంలో పేమెంట్స్‌ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి  జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ZPPL)కు 2024 జనవరి 24న రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి అధికార ధ్రువీకరణ పత్రం మంజూరైంద అని ఫుడ్‌టెక్ సంస్థ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. జొమాటోతోపాటు టాటా పే, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ సంస్థలకు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పేమెంట్స్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ లైసెన్స్‌ మంజూరైంది.

జొమాటో గత సంవత్సరం ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి తన సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకుంది. 
లావాదేవీలను సులభతరం చేయడానికి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ఇతర చెల్లింపు యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఇందుకు కారణం. దీంతో థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులతో వచ్చే మర్చెంట్‌ ఛార్జీలు ఆదా అవుతాయి. కాగా గతంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను అందించడం కోసం RBL బ్యాంక్‌తో కూడా జొమాటో జతకట్టింది. అయితే గత ఏడాది మేలో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)