Breaking News

డెలివరీ బాయ్‌కి ఇంత ఖరీదైన బైకా? అవాక్కవుతున్న నెటిజన్లు - వీడియో వైరల్

Published on Sat, 09/09/2023 - 17:26

జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్‌ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్‌కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు.

నెలకు రూ. 45,000..
వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్‌కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్‌షిప్‌.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)