Breaking News

రాజీనామా చేసిన వారికి ఆహ్వానం

Published on Fri, 02/13/2026 - 13:05

జొమాటో సంస్థను వదిలి వెళ్లిన మాజీ ఉద్యోగులను తిరిగి ఆహ్వానిస్తూ జొమాటో గ్రూప్ (ఎటర్నల్) వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చేసిన ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆయనకు సుమారు 8,000 ఈమెయిల్స్ వచ్చినట్లు ఆయన ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఈమెయిల్స్‌ను రెండు వర్గాలుగా విభజించవచ్చు. అందులో గతంలో ఎటర్నల్ ప్రయాణంలో భాగమై వివిధ కారణాలతో సంస్థను వీడిన 4,000 మంది మాజీ ఉద్యోగులు కొందరున్నారు. ఇప్పటివరకు సంస్థలో పనిచేయకపోయినా జొమాటో సంస్కృతికి ఆకర్షితులై చేరాలనుకుంటున్న వారు మరో 4,000 మంది ఉన్నారు. ‘నేను దీన్ని అస్సలు ఊహించలేదు. చాలా ధన్యవాదాలు. ఈ ఈమెయిల్స్‌లో ఎన్నో కథలు, భావోద్వేగాలు, నిజాయితీ దాగి ఉన్నాయి’ అని గోయల్ ఆనందం వ్యక్తం చేశారు.

పాత సహోద్యోగులకు బంపర్ ఆఫర్

సంస్థ గత కొన్నేళ్లుగా ఎదుగుతున్న క్రమంలో పాత ఉద్యోగులతో తనకు ఉన్న అనుబంధం ప్రస్తుత టీమ్‌కు ఉండకపోవచ్చని గోయల్ అభిప్రాయపడ్డారు. 8,000 మెయిల్స్ స్వయంగా చదవడం సమయంతో కూడుకున్న పని కావడంతో తనతో నేరుగా పనిచేసిన వారికి ఆయన ఒక వెసులుబాటు కల్పించారు. ఎవరైనా గతంలో దీపిందర్‌తో పనిచేసి ఉంటే మెయిల్ కోసం వేచి చూడకుండా నేరుగా తన మొబైల్ నంబర్ కనుగొని వాట్సాప్ చేయమని ఆయన కోరారు.

‘గతాన్ని పట్టించుకోను’

మాజీ ఉద్యోగుల పట్ల గోయల్ చూపిన సానుకూల దృక్పథం చర్చనీయాంశమైంది. గతంలో వారు ఎందుకు వెళ్లిపోయారు లేదా ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేశారనే విషయాలను పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో సంస్థలో సరైన వాతావరణం లేదా నాయకత్వం లేకపోవడం వల్ల కొందరు వెళ్లిపోయి ఉండవచ్చని ఆయన నిజాయితీగా అంగీకరించారు. ‘నేను గతాన్ని పట్టుకుని కూర్చుంటానని మీరు భావించవద్దు. తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మాకు మీ అవసరం ఉంది’ అంటూ ఆయన భరోసా ఇచ్చారు.

ఎందుకు మాజీ ఉద్యోగులకే ప్రాధాన్యత?

సంస్థ పనితీరు, దాని విలువలు తెలిసిన వారు తిరిగి రావడం వల్ల పని వేగవంతం అవుతుందని గోయల్ నమ్ముతున్నారు. ‘ఎటర్నల్‌లో ఇంకా వృద్ధి చెందాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఎదిగి, బయటకు వెళ్లి తిరిగి రావాలనుకునే వారికంటే మెరుగైన అభ్యర్థి మరొకరు ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: డబుల్‌ డ్రాప్‌.. ఇంకా భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)