Breaking News

సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్‌

Published on Sat, 03/30/2024 - 13:07

శాకాహారుల కోసం జొమాటో ప్రత్యేకంగా ప్రారంభించిన ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొత్త సేవలు ప్రారంభమైన కొద్దిసేపటికే అందులో మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. డెలివరీ బాయ్స్‌ కోసం ప్రత్యేకంగా గ్రీన్‌ యూనిఫాం కాకుండా ఎర్ర రంగు దుస్తులు మాత్రమే ఉంటాయని ప్రకటించి వివాదానికి ముగింపు పలికింది. అయితే, శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించడం వెనుక కారణం.. వివాదాస్పదమైన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలను కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ఇటీవల ఓ వార్తాసంస్థకు తెలిపారు.

జొమాటో వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ ప్రారంభించామని దీపిందర్‌ చెప్పారు. తర్వాత ఓ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ‘మీరు మరిన్ని ఆర్డర్లు చేయాలంటే జొమాటో నుంచి ఏం ఆశిస్తున్నారు?’ అని వినియోగదారులను అడిగినట్లు చెప్పారు. దీంట్లో చాలా మంది శాకాహారుల కోసం మరేదైనా ప్రత్యేక సేవలు అందించాలని సూచించినట్లు తెలిపారు. దీనిపై సుదీర్ఘ చర్చల తర్వాత ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ సేవలను ప్రారంభించామన్నారు. అయితే, ఆ పదాల్లో ఉన్న నిగూఢార్థం తమకు తెలియదని.. ఇంతటి వివాదానికి కారణమవుతుందని ఊహించలేదన్నారు. సోషల్‌ మీడియాలో వివాదం తలెత్తిన తర్వాతే అసలు విషయం అర్థమైందన్నారు.

ఇదీ చదవండి..డెబిట్‌ కార్డు యూజర్లపై భారంమోపిన ప్రముఖ బ్యాంక్‌

సామాజిక మాధ్యమాల్లో వివాదానికి తెరలేపే వార్తలు వైరల్‌గా మారిన నేపథ్యంలో వెంటనే దాదాపు 20 గంటల పాటు జొమాటోలోని ఉన్నతోద్యోగులందరూ జూమ్‌ కాల్‌లో చర్చించామని చెప్పారు. సమస్యను ఎలా పరిష్కరించాలో మంతనాలు జరిపినట్లు తెలిపారు. చివరకు గ్రీన్ యూనిఫామ్‌ తొలగించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. కొత్త సేవల వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)