Breaking News

క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ

Published on Fri, 01/17/2025 - 17:07

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'జొమాటో' (Zomato) సీఈఓ 'దీపిందర్ గోయల్' (Deepinder Goyal) వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ గోయల్ ఎందుకు సారీ చెప్పారు? దీనికి కారణం ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

జొమాటో వెజిటేరియన్ ఫుడ్ డెలివీలపై ప్రత్యేకంగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ రంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'వెజ్ మోడ్ ఎనేబుల్‌మెంట్‌ ఫీ' పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా.. ఈ రోజుల్లో భారతదేశంలో శాఖాహారిగా ఉండటం శాపంలా అనిపిస్తుందని లింక్డ్‌ఇన్‌లో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడం మాత్రమే కాకుండా.. ఫీజుకు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు జొమాటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీలో శాకాహార డెలివరీలపై ఎటువంటి ఛార్జీలు వసూలుచేయడం లేదని.. వెజిటేరియన్లను కూడా సమానంగా చూస్తున్నందుకు స్విగ్గీకి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కొత్త ఛార్జ్ సమస్యపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌ ఫీజులను ఎందుకు వసూలు చేస్తున్నారు. ఇలా ఎన్ని రకాలుగా ఫీజులు వసూలు చేస్తారని ఆగ్రహించారు. ఈ పోస్టుపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. తప్పు జరిగినందుకు క్షమించండి. ఈ ఫీజును ఈ రోజు నుంచే తొలగిస్తున్నామని, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూస్తామని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు