Breaking News

జొమాటో కొత్త ఛార్జీలు: దూరాన్ని బట్టి బాదుడే..

Published on Fri, 05/23/2025 - 17:07

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్.. జొమాటో కొత్త ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 4 కి.మీ కంటే ఎక్కువ దూరం డెలివరీ చేసే ఫుడ్ ఆర్డర్‌ల కోసం ''లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు'' పేరుతో అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది.

150 రూపాయల కంటే ఎక్కువ విలువైన ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. బుక్ చేసుకునే హోటల్/రెస్టారెంట్ దూరం 4 నుంచి 6 కి.మీ మధ్య ఉంటే రూ. 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ దూరం ఉంటే.. దూరాన్ని బట్టి అదనపు ఛార్జీ (రూ. 25, రూ. 35) మారుతుంది. ఈ ఛార్జీ మీరు ఎంత ధరకు ఫుడ్ బుక్ చేసుకున్నారు అనేదాని మీద ఆధారపడి ఉండదు.

కోవిడ్-19 కి ముందు, జొమాటో 4-5 కి.మీ పరిధిలో ఉచిత డెలివరీని అనుమతించింది. మహమ్మారి తర్వాత, చాలా రెస్టారెంట్లు క్లోజ్ అయ్యాయి. దీంతో ఆ పరిమితిని 15 కి.మీ.లకు పొడిగించారు. తరువాత డెలివరీ ఫీజు వసూలు చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి అదనపు ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి: గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?

జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం.. కస్టమర్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోతుంటే.. ఫుడ్ కోసం ఖర్చు చేసే డబ్బుకంటే డెలివరీ కోసం చేసే ఖర్చు ఎక్కువవుతుందని కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద జొమాటో నిర్ణయం వల్ల.. సంస్థ ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)