Breaking News

జొమాటో చరిత్రలోనే తొలిసారి.. ఒక్కడే రూ.5 లక్షల బిల్లు!

Published on Mon, 12/30/2024 - 19:14

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' (Swiggy) 2024కు సంబంధించిన యాన్యువల్ డేటా విడుదల చేసిన తరువాత 'జొమాటో' (Zomato) కూడా వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్ 'బిర్యానీ' అని తేల్చి చెప్పింది. అయితే ఒక్క వ్యక్తి మాత్రం ఒక రెస్టారెంట్‌లో రూ. 5 లక్షల కంటే ఎక్కువ బిల్ చెల్లించినట్లు సమాచారం.

2024లో జొమాటో ద్వారా 9 కోట్ల కంటే ఎక్కువ బిర్యానీ ఆర్డర్‌లు చేసినట్లు సమాచారం. అంతే సెకనుకు మూడు బిర్యానీల కంటే ఎక్కువ ఆర్డర్‌లు వచ్చాయి. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ఎక్కువమంది ఆర్డర్ చేసుకున్న ఫుడ్‌గా బిర్యానీ రెకార్డ్ క్రియేట్ చేసింది. అయితే  స్విగ్గీలో రైస్ డిష్ అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆహారం అని తెలుస్తోంది.

బిర్యానీ తరువాత ఎక్కువగా  ఆర్డర్ చేయబడిన ఆహార పదార్థాల జాబితాలో పిజ్జా రెండవ స్థానంలో ఉంది. 2024లో జొమాటో ఏకంగా 5 కోట్ల కంటే ఎక్కువ పిజ్జాలను డెలివరీ చేసింది. ఫుడ్ విషయం పక్కన పెడితే 77,76,725 కప్పుల 'టీ', 74,32,856 కప్పుల కాఫీ ఆర్డర్లను జొమాటో స్వీకరించింది.

అగ్రస్థానములో ఢిల్లీ
జొమాటో ఆఫర్‌లతో, ఢిల్లీ నివాసితులు తమ భోజన ఖర్చులపై ఏకంగా రూ. 195 కోట్లను ఆదా చేసినట్లు జొమాటో వెల్లడించింది. ఆ తరువాత జాబితాలో బెంగళూరు, ముంబై వంటివి ఉన్నాయి. ఈ సంవత్సరం భారతీయులు జనవరి 1 నుంచి డిసెంబర్ 6 మధ్య 1 కోటి కంటే ఎక్కువ టేబుల్‌లను రిజర్వ్ చేసుకోవడానికి జొమాటోను ఉపయోగించారు. ఇందులో ఎక్కువగా ఫాదర్స్ డే రోజు రిజర్వ్ చేసుకున్నారు.

ఒకే వ్యక్తి రూ.5.13 లక్షల బిల్లు
ఒక్కసారికి మహా అయితే ఓ వెయ్యి లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్తే.. ఒక పది వేలు ఖర్చు అవుతుంది అనుకుందాం. కానీ బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఒక రెస్టారంట్‌లో ఏకంగా రూ. 5.13 లక్షలు బిల్ చెల్లించినట్లు జొమాటో వెల్లడించింది. డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్లు ఇంత చెల్లించడం జొమాటో చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)