Breaking News

అమ్మకు ఖరీదైన కారు గిఫ్ట్‌..

Published on Mon, 03/17/2025 - 13:45

ప్రతి తల్లీ తన పిల్లల విజయాన్నే కాంక్షిస్తుంది. వారి విజయానికి మించిన గొప్ప బహుమతి మరేది ఉండదామెకు. కానీ రేవతి కామత్‌కు ఆమె కుమారులు  జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్‌, నితిన్ కామత్‌లు అమితమైన ఆనందాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు.

ఖరీదైన సరికొత్త లగ్జరీ మెర్సిడెస్ కారును గిఫ్ట్‌ ఇచ్చి తల్లికి గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. సంప్రదాయ స్పర్శను జోడించి ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకం చేశారు. గర్వంతో ఉప్పొంగిన తల్లి రేవతి కామత్‌ తన ఆనందాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. "నా కొడుకులు ఈరోజు నాకు కొత్త కారును బహుమతిగా ఇచ్చారు. తలపాగ, శాలువాతో ఇలా.. కారు తాళాలు అందుకున్నాను" అంటూ ఫొటోలను షేర్‌ చేశారు.

పేటా (సంప్రదాయ తలపాగా), షాల్‌ (ఉత్సవ శాలువా)తో సత్కరిస్తుండగా ఆమె కారు తాళాలు అందుకున్న క్షణాలు ఈ ఫొటోల్లో ఉన్నాయి. ఫోటోలలో కన్పిస్తున్న లగ్జరీ వాహనం మెర్సిడెస్ జీఎల్ఎస్. దీని ధర రూ .1.5 కోట్లకు పైగా ఉంటుంది. జీఎల్ఎస్ కారులో విశాలమైన అల్ట్రా-లగ్జరీ క్యాబిన్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్, శక్తివంతమైన ఇంజన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.

వ్యాపార చతురతకు, దాతృత్వానికి పేరుగాంచిన నిఖిల్ కామత్, అలాగే ఆయన సోదరుడు జెరోధా సీఈఓ నితిన్ కామత్‌లు తమకు విలువలు, నైతికతను తీర్చిదిద్దిన ఘనత తమ తల్లిదేనని తరచూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. ఇదిలా ఉండగా నితిన్ కామత్ ఇటీవల ప్రతిష్టాత్మక ఈవై ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (ఈఓవై) 2024 అవార్డును అందుకున్నారు. ఆయన వినూత్న, తక్కువ-మార్జిన్, అధిక-వాల్యూమ్ బ్రోకరేజీ మోడల్ భారతదేశ స్టాక్ ట్రేడింగ్ పరిశ్రమను మార్చివేసింది. స్వయంకృషితో జెరోధాను బాహ్య నిధులు లేకుండానే బిలియన్ డాలర్ల సంస్థగా ఆయన నిర్మించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)